Millet Cafe: కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చే వారికోసం మిల్లెట్ కేఫ్
Millet Cafe: కలెక్టరేట్ లోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో మిల్లెట్ కేఫ్ ఏర్పాటు
Millet Cafe: కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చే వారికోసం మిల్లెట్ కేఫ్
Millet Cafe: ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, తృణ ధాన్యాలను పండించే రైతులకు చేయూతనిచ్చేలా కర్నూలు జిల్లా కలెక్టర్ ఓ అడుగు ముందుకు వేశారు. కలెక్టరేట్ లోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో మిల్లెట్ కేఫ్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో పని చేసే ఉద్యోగులతో పాటు నిత్యం వివిధ పనులు నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చే వారికోసం మిల్లెట్ కేఫ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన అట్టహాసంగా ప్రారంభించారు.. తృణధాన్యాల సాగువైపు మక్కువ చూపేలా రైతుల్ని ప్రోత్సహించారు. తక్కువ నీటి ఖర్చుతో అధిక దిగుబడి సాధించి మంచి ధరకు అమ్ముడయ్యే తృణ ధాన్యాల వైపు అడుగులు వేసేలా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు.