Andhra Pradesh: ఏపీలో నేడు మేయర్లు, చైర్‌ పర్సన్‌ల ఎంపిక

Andhra Pradesh: ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలకు అవకాశం * ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారు

Update: 2021-03-18 02:53 GMT

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. 75 మున్సిపాలిటీలకు 73 స్థానాలు దక్కించుకుంది. 12 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగ్గా.. అందులో 11 కార్పొరేషన్‌లలో ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఆపదకొండు కార్పొరేషన్‌ల మేయర్‌ అభ్యర్థులతోపాటు చైర్మన్, వైస్‌ చైర్మన్ల తుది జాబితా ఇవాళ వెలుబడనుంది.

ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలకు పెద్ద ఎత్తున స్థానం కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చట్టబద్ధంగా ఉన్న రిజర్వేషన్లకు మించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బీసీలకు, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇక కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖారారు కాగా ఇంకా కొన్ని స్థానాలకు ఖాళీలు పూర్తి కావాల్సి ఉంది. ఇక ఇవాళ ఆపూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ప్రమాణస్వీకారాలకి ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే తుది జాబితా ఇవాళ విడుదల కానుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా తాడిపత్రి, మైదుకూరులో సమాన మెజార్టీ వస్తే టాస్ ద్వారా మేయర్‌ పీఠాన్ని నిర్ణయించనున్నారు.

Tags:    

Similar News