ఏలేరు ఆధునీకరణ అత్యవసరమే: మరోతి శివ గణేష్

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరోతి శివ గణేష్ ఏలూరు ప్రాజెక్టు ఆయకట్టు కాలువలు సందర్శించారు.

Update: 2019-12-05 03:33 GMT
మరోతి శివ గణేష్, శ్రీ వత్సవాయి బాబు, ఏ. వి సుధాకర్

జగ్గంపేట: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరోతి శివ గణేష్ ఏలూరు ప్రాజెక్టు ఆయకట్టు కాలువలు సందర్శించారు. కిర్లంపూడి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టులకు సంబంధించి నూతనంగా నిర్మాణం చేసిన తిరుమాలి రెగ్యులేటర్ నుండి ముక్కొల్లు రెగ్యులేటర్ వరకు పంట కాలువల పరిస్థితి వివరించారు. 67 , 000 ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందించే ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు కాలువలు అధ్వానంగా ఉన్నాయన్నారు.

2007 సంవత్సరంలో 40,000 క్యూ సెక్స్ వరకు వరద నీరు వదలడం వలన రాజుపాలెం, ముక్కొల్లు, గోనేడ గ్రామాలు మునగగా నాటి ప్రభుత్వం ( కాంగ్రెస్ ప్రభుత్వం ) చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు ముగ్గురితో త్రిసభ్య కమిటీ వేసి అంచనా రూపొందించి ఎర్ర కాలువ అనబడే ( ప్లడ్ & ఈ ఇరిగేషన్ కెనాల్ ) ను వెడల్పును విస్తరించి 75 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించేలా సాంకేతిక అంచనాలు తయారుచేసి నిర్మాణం నిమిత్తం 137 కోట్లు విడుదల చేశారు. 2015 సంవత్సరంలో మరో 165 కోట్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వత్సవాయి బాబు, ఏ. వి సుధాకర్, డాక్టర్ నక్క సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News