Anakapalli: అనకాపల్లి జిల్లాలో కుంగిన బ్రిడ్జి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం..
Anakapalli: అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది,. అండర్ బ్రిడ్జి రైల్వే సేఫ్టీగోడను టిప్పర్ ఢీకొట్టింది.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో కుంగిన బ్రిడ్జి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం..
Anakapalli: అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది,. అండర్ బ్రిడ్జి రైల్వే సేఫ్టీగోడను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది.హెవీలోడ్ తో అనకాపల్లి నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు నిలిచిపోయింది. విశాఖ-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కశింకోట దగ్గర గోదావరి, విశాఖ ఎక్స్ ప్రెస్ లను నిలిపి వేశారు. ఎలమంచిలిలో మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిపి వేశారు.
దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు సిబ్బంది మరమ్మత్తులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఒక ట్రాక్ పై మాత్రమే రైళ్ల రాకపోకలకు అనుమతిచ్చారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. గూడ్స్ రైల్లో హెవీ లోడ్ కారణంగా ప్రమాద జరిగిందని భావిస్తున్నారు.