విశాఖలో గ్యాస్‌ కష్టాలు...

నగర ప్రజలకు గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్‌ ఏజెన్సీలకు సిలిండర్లు చేరినా ఇంటికి డెలివరీ చేయడానికి బార్సు ఆసక్తి చూపకపోవడంతో ప్రజల చెంతకు గ్యాస్‌ బండలు చేరటం లేదు.

Update: 2020-03-31 13:20 GMT

విశాఖపట్నం: నగర ప్రజలకు గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్‌ ఏజెన్సీలకు సిలిండర్లు చేరినా ఇంటికి డెలివరీ చేయడానికి బార్సు ఆసక్తి చూపకపోవడంతో ప్రజల చెంతకు గ్యాస్‌ బండలు చేరటం లేదు. రీఫిల్‌ కేంద్రాలు కూడా పనిచేయకపోవడం వల్ల గ్యాస్‌ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. నగర జనాభా 20 లక్షల పైమాటే. గ్యాస్‌ కనెక్షన్లు 7 లక్షలు, హోటళ్లు, ఇతరత్రా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ సెంటర్లు మూసివేయడంతో కమర్షియల్‌ గ్యాస్‌ వాడకం తగ్గిపోయింది.

COVIDసుమారు రూ.3.50 నుంచి 4 లక్షల వరకూ ఇంటి గ్యాస్‌ కనెక్షన్లు ఉంటాయి. కరోనా వైరస్‌ వల్ల డెలివరీ బాయ్స్ విధుల్లోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే, అపార్టుమెంట్‌ వాసులు లోపలికి రానివ్వటం లేదు. దీంతో ఇళ్లకు గ్యాస్‌ సరఫరా అవ్వటం లేదు. అత్యవసరమైతే కొంతమంది గ్యాస్‌ ఏజెన్సీకి వస్తున్నారని, వారికి అందజేస్తున్నామని ద్వారకా హెచ్‌బి గ్యాస్‌ డీలర్‌ తెలిపారు. ఇద్దరు ముగ్గురు మాత్రమే బార్సు వస్తున్నారని, వారితోనే సరఫరా చేయిస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News