Nellore: కావలిలో బస్సు డ్రైవర్‌పై మూకుమ్మడి దాడి..
Nellore: దాడి వీడియో తీస్తున్న ఫోన్ ధ్వంసం
Nellore: కావలిలో బస్సు డ్రైవర్‌పై మూకుమ్మడి దాడి..
Nellore: ఆర్టీసీ డ్రైవర్‌పై పలువురు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన సంఘటన నెల్లూరు జిల్లా కావలి శివారులో చోటుచేసుకుంది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడకు వెళుతోంది. కావలిలోని ట్రంకురోడ్డులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంసింగ్ తన ముందున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో ఆ ద్విచక్రవాహనదారుడు వాదనకు వచ్చాడు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. ఈ విషయాన్ని ఆ వాహనదారుడు తన మిత్రులకు చెప్పడంతో 14 మంది ఆర్టీసీ బస్సును వెంబడించారు.
కావాలి శివార్లలోని మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ ఉదంతాన్ని బస్సులోని ఓ ప్రయాణీకుడు వీడియో తీస్తుండగా అతనిపైనా దాడికి పాల్పడి ఫోన్‌ను ధ్వంసం చేశారు. ఈ సమాచారం తెలియగానే కావలి గ్రామీణ సీఐ టీ.సుమన్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. డ్రైవర్‌ను కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.