Srisailam: భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో చిరుత కలకలం
Srisailam: శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.
Srisailam: శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుతపులి వచ్చింది. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది అప్రమత్తమయ్యారు. పుణ్య స్నానాలకు వెళ్ళే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు అనౌన్స్ చేయిస్తున్నారు. నల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నట్లు ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.