Kotamreddy Sridhar Reddy: నేను చేసిన తప్పేంటో చెప్పాలి.. దౌర్జన్యంగా తనను సస్పెండ్‌ చేశారని..

AP Assembly: ఏపీ శాసనసభలో వైసీపీ తీరు బాధాకరమన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

Update: 2023-03-15 10:01 GMT

Kotamreddy Sridhar Reddy: నేను చేసిన తప్పేంటో చెప్పాలి.. దౌర్జన్యంగా తనను సస్పెండ్‌ చేశారని..

AP Assembly: ఏపీ శాసనసభలో వైసీపీ తీరు బాధాకరమన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తాను చేసిన తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరితే తనను సభ నుంచి సస్పెండ్‌ చేయడమేంటని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ప్రకటించిన తర్వాత ఆయన పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దౌర్జన్యంగా తనను సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్‌లోని సమస్యలు అడగటం తప్పా? అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై 5నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా... ఇద్దరు మంత్రులకు తిట్టేందుకే 20 నిమిషాలు ఇచ్చారన్నారు. కొందరు మంత్రులు అధికార మదంతో వ్యవహరించారని కోటంరెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News