మోడీ మెచ్చిన"బుట్టబొమ్మ"

Update: 2020-09-03 09:57 GMT

Kondapalli Toys: కొండపల్లి బొమ్మల ప్రత్యేకత గురించిన తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తికాదు.. అలాంటి కొండపల్లి బొమ్మలు దేశ ప్రధాని మోదీ నోట వినిపిస్తే కళలపై వీలైనప్పుడల్లా మక్కువ చూపే మోదీ ఈ సారి మన కొండపల్లి బొమ్మల అందాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ మన్ కీ బాత్ కొండపల్లి బొమ్మల ప్రాచుర్యానికి వేదికైంది. హస్తకళల్లో ఏటికొప్పాకం చెక్క బొమ్మలది అగ్రస్థానం. అలాంటి కొండపల్లి బొమ్మలు ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ మనస్సునే దోచాయి. దీంతో కొండపల్లి చెక్కబొమ్మల తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణాజిల్లా కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడ అడవుల్లో దొరికే ప్రత్యేకమైన చెక్కతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. వారి కళానైపుణ్యం ఒక్కొక్క బొమ్మలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ బొమ్మల తయారీదారుల ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంతమాత్రమనే చెప్పాలి. ఎంతో అందంగా సిద్ధం చేసిన చెక్క బొమ్మలను ఏవిధంగా మార్కెటింగ్ చేయాలో తెలియకపోవడం కూడా ఒక కారణం. ఇలాంటి సమయంలో ప్రధాని కొండపల్లి బొమ్మల ప్రస్తావన తెవడం, హస్తకళలను ఆదుకోవాలని పిలుపునివ్వడం ఆ కళాకారులకు భరోసానివ్వడమే.

మనం ఇక్కడ చూస్తున్న అందమైన బొమ్మల వెనుక ఒక చిన్నపాటి యుధ్దమే ఉందని చెప్పాలి. బొమ్మల తయారీకి కావాల్సిన చెక్కను సేకరించడం దగ్గరనుంచి వాటిని అద్భుతంగా చెక్కడం, ఆకర్షణీయమైన రంగులు వేయడం వరకు వాళ్ల కష్టం మాటల్లో చెప్పలేనిది. ఇంత కష్టపడుతున్నా తమకు వచ్చే చాలీచాలని డబ్బులతో కుటుంబపోషణే భారమవుతోందని వాపోతున్నారు. దీనికి కరోనా కూడా తోడవడంతో వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. కొండపల్లి బొమ్మలు బైటా అందుబాటులో లేవని చాలా మంది చెప్తున్నారు. వీరు తయారు చేసే చెక్క బొమ్మలకు సరైన మార్కెట్ కల్పించి రోజుకి 3 నుంచి 5వందల వరకు ఆదాయం వస్తే ప్రతి ఒక్కరు ఈ రంగంలోకి రావటానికి సిద్ధంగా వున్నారు. అటు పర్యాటకులు కూ హైదరాబాద్ నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు కొండపల్లి బొమ్మలపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. మొత్తానికి ఊహించని విధంగా ప్రధాని చేసిన ప్రకటనతో హస్త కళల రంగం మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి కళకారులు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదిశగా చర్యలు చేపడితే కొండపల్లి కళాకారుల కష్టాలు గట్టెక్కినట్టవుతుంది.

Tags:    

Similar News