Konaseema: కోనసీమ జిల్లా కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

Konaseema: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద భారీ స్థాయిలో పడవ పోటీల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Update: 2026-01-02 05:27 GMT

Konaseema: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద భారీ స్థాయిలో పడవ పోటీల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మరియు పోటీల ట్రయల్ రన్‌ను ప్రారంభించేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.

పడవ పోటీలను ప్రారంభించే క్రమంలో కలెక్టర్ అకస్మాత్తుగా అదుపుతప్పి కాలువలో పడిపోయారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్ నీటిలో పడగానే అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు (స్విమ్మర్లు) వెంటనే స్పందించారు. వెంటనే ఆయన్ను నీటిలో నుండి బయటకు తీసి, మరో పడవలోకి చేర్చారు.

సమయానికి స్విమ్మర్లు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు మరియు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కలెక్టర్ క్షేమంగా ఉన్నారు.

Tags:    

Similar News