మంత్రి కొడాలి నానికి కరోనా పరీక్షలు..

అసెంబ్లీ సమావేశాలు నేపధ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి కూడా సోమవారం రాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Update: 2020-06-17 08:16 GMT

అసెంబ్లీ సమావేశాలు నేపధ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి కూడా సోమవారం రాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయన రిపోర్టు నిన్న సాయంత్రం వచ్చినట్టు తెలుస్తోంది. ఈపరీక్షల్లో మంత్రి కొడాలి నాని రిపోర్టు నెగిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

నాసల్‌ స్వాబ్‌ పరీక్ష ద్వారా వైద్యులు వెల్లడించినట్లు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం వెల్లడించింది. కాగా ఏపీలో ఇప్పటివరకు 5555 పాజిటివ్ కేసులొచ్చాయి. బుధవారం కొత్తగా 275 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇద్దరు మృతిచెందారు. గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 15,188 నమూనాలను పరీక్షించారు.


Tags:    

Similar News