ఏపీకి కియామోటార్స్ గుడ్ న్యూస్.. పెట్టుబడులు పెంచనున్న కంపెనీ!

ఆంధ్ర ప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్ సంస్థ ముందుకు వచ్చింది.

Update: 2020-05-28 10:14 GMT
KIA Motors (File Photo)|

ఆంధ్ర ప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్ సంస్థ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మరో 54 మిలియన్‌ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ సీఈవో కూకున్‌ షిమ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ కొత్త పెట్టుబడులు కియా ఎస్‌యూవీ వెహికల్స్‌ తయారీకి పెడుతున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కియాకి బలమైన బంధం ఉందని కూక్యూన్‌ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక రంగంపై జరిగిన సదస్సులో కియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో మ్మరిన్ని పెట్టుబడులుఅవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నుండి కియా సంస్థ వెళ్ళిపోతుందని దుష్ప్రచారాలు జరిగాయని.. చివరికి కియా యాజమాన్యం ముందుకొచ్చి తము ఎక్కడికీ వెళ్ళడం లేదని ప్రభుత్వానికి చెప్పినట్టు గుర్తు చేసారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ కోత లేదని.. పరిశ్రమల ఏర్పాటుకై పెట్టుబడు దారులకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కియా మోటార్స్ పరిశ్రమ తరలిపోతుందని వదంతులు వ్యాపించాయి. వాటిని కియా మోటార్స్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖండించింది. అయితే, జాతీయ స్థాయిలో ఈ విషయంపై చాలా రోజుల వరకూ వార్తల్లో చర్చలు నడిచాయి. అంతే కాకుండా హైదరాబాద్, ముంబాయి లకు కియా తరలిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పడు కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెంచుతామని ప్రకటించడంతో అవన్నీ వదంతులే అని స్పష్టం అవుతోంది.


Tags:    

Similar News