AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఈ నెల 15 నుంచి కుల గణన..
AP Cabinet Meeting: జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్ లో చర్చ
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఈ నెల 15 నుంచి కుల గణన..
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశంలో 38 అంశాలతో ఎజెండా రూపొందించారు. 38 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. SIPB నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్‌లో సుధీర్ఘ చర్చ జరిగింది. టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్‌కు గ్రూప్ వన్ పోస్టు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డీఏకు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. కులగణన చేపట్టేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 15 నుంచి కులగణన ప్రారంభం కానుంది. ఏపీలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాలయాల ఆదాయ పరిమితుల ఆధారంగా కేటగిరీల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.