Daggubati Venkateswara Rao: ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవు

Daggubati Venkateswara Rao: నేను, నా కొడుకు వచ్చే ఎన్నికల్లో పోటీచేయము

Update: 2024-01-10 13:56 GMT

Daggubati Venkateswara Rao: ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవు

Daggubati Venkateswara Rao: తాజా రాజకీయాలపై సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవన్నారు. 30, 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా తిరిగి సంపాదించుకునే అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారని.. సంపదంతా పార్టీ అధిపతుల దగ్గరకు చేరుకుంటుందని అన్నారు. ఎమ్మెల్యేలకు ప్రజలకు సేవ చేసే అవకాశం లేదని.. తన దృష్టిలో టికెట్ రాని వాళ్లు అదృష్టవంతులంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు. తాను తన కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News