తప్పుడు ప్రచారంపై పరువు నష్టం: జనసేన

గత కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో 62 ఎకరాలు భూమి కొన్నారని.. అందుకే ఆయన అమరావతికి సపోర్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2020-01-25 10:16 GMT

గత కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో 62 ఎకరాలు భూమి కొన్నారని.. అందుకే ఆయన అమరావతికి సపోర్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రచారం చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. అందులో.. 'జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచ బుద్ధితో బురద చల్లడానికి కొందరు ప్రజా వ్యతిరేకులు కుట్రలు పన్ని తమ అనుచరగణంతో వాటిని అమలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడు ఉండటంతో...

ఎదురొడ్డి పోరాడలేని అల్పబుద్ధి గల వాళ్ళే - జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గారికి అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నాయని, తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్నవారిపైనా, సోషల్‌ మీడియాలో వక్ర రాతలు రాస్తున్నవారిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్‌ విభాగం నిర్ణయించింది. ఈ ప్రచారానికి కారకులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నాము. ఒకటి రెండు రోజులలో వారందరికీ లీగల్‌ నోటీసులు పంపుతాము.' అని పేర్కొంది. 





Tags:    

Similar News