సీఎం జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టీటీడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

Update: 2020-05-03 13:27 GMT
Pawan Kalyan(File photo)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టీటీడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో 15 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న కార్మికులను, సూపర్వైజర్లను1400 మందిని తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టీటీడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో 15 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న కార్మికులను, సూపర్వైజర్లను1400 మందిని తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కాగా.. టీటీడీ తొలగించిన 1400 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సోమవారం నుంచి తిరిగి విధుల్లోకి రావాలని సూపర్ వైజర్లకు, కార్మికులకు అధికారులు నుంచి వర్తమానం అందినట్టు సమాచారం. టీటీడీ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. టీటీడీ పాలకవర్గం, అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న అందరికీ అభినందనలు అంటూ జనసేనాని ట్వీట్ చేశారు.

ఇటీవలే టీటీడీ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్‌ కార్మికులను తొలగించడం మీద విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ వైఖరిని తప్పుపట్టారు. టీటీడీనే నమ్ముకుని పనిచేస్తున్న 1400 మందిని విధుల నుంచి తొలగించడం సమాజసం కాదని అన్నారు. ప్రధాని మోదీ ఉద్యోగులను తొలగించొద్దని, వేతనాలు కూడా ఇవ్వాలని విషయాన్ని గుర్తు చేశారు.




 


Tags:    

Similar News