CM Jagan: తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు
CM Jagan: ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు
CM Jagan: తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు
CM Jagan: ఏపీ ప్రభుత్వం పేదలకు ప్రతి నెలా పెన్షన్లు అందిస్తోంది. అయితే ఇప్పడిస్తోన్న పెన్షన్ సరిపోకపోవడంతో పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో బాగంగా కాకినాడలో పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని,ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారాయన... పెన్షన్ల కోసం ప్రతి నెలా 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను 3 వేల రూపాయలకు పెంచామన్నారు సీఎం జగన్... పెన్షన్ల పంపిణీ కోసం ఏడాదికి 23 వేల 556 కోట్ల రూపాచల వ్యయం అవుతోందన్నారు.
గతంలో పెన్షన్లు కావాలంటే జన్మభూమి కమిటీకి లంచాలు ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఏడాది అంటే క్యాలెండర్‌లో మార్పు కాదని, పేదల జీవితంలో మార్పు అని అన్నారు జగన్... పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి రాలేదని, ప్రస్తుతం 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు సీఎం జగన్... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారాయన... ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదని జగన్ ఎద్దేవా చేశారు.