Additional Sp Srilakshmi: బాలిక మృతి పట్ల అసత్య ప్రచారం చేయడం సరికాదు

Additional Sp Srilakshmi: సోషల్‌ మీడియాలో మైనర్‌ బాలిక పేరు ప్రస్తావిస్తే .. కఠిన చర్యలు తీసుకుంటాం

Update: 2023-09-26 13:48 GMT

Additional Sp Srilakshmi: బాలిక మృతి పట్ల అసత్య ప్రచారం చేయడం సరికాదు

Additional Sp Srilakshmi: చిత్తూరు జిల్లా పెనుమూరు మైనర్‌ బాలిక మృతిపై అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మీ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. బాలిక మృతి పట్ల అసత్య ప్రచారం చేయడం సరికాదని అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మీ అన్నారు. బాలిక అనుమానాస్పద మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సోషల్‌ ఈ కేసులో పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆమె స్పష్టం చేశారు. కుటుంబసభ్యులు అనుమానిస్తున్న నలుగురిని విచారించామని తెలిపారు. సోషల్‌ మీడియాలో మైనర్‌ బాలిక పేరుప్రస్తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మీ హెచ్చరించారు.

Tags:    

Similar News