కొత్త ఏడాదిలో భారీ ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు

ISRO: ఈ ఏడాది పది ప్రయోగాలు చేపట్టాలన్న లక్ష్యంతో అడుగులు

Update: 2023-01-17 11:27 GMT

కొత్త ఏడాదిలో భారీ ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు    

ISRO: కొత్త ఏడాది భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోట లోని షార్ లో సందడి మొదలు కాబోతోంది. ఇస్రో ఈ ఏడాది 10 నుంచి 15 ప్రయోగాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా షార్‌లో మొదటి లాంచింగ్‌ కాంప్లెక్స్‌లో పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి బిల్డింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు ఇస్రో శాస్త్రవేత్తలు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ ఏడాది ఎక్కువ ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఏడాదిలో శ్రీహరికోట షార్ నుంచి సుమారు 10 నుంచి 15 ప్రయోగాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా షార్‌లోని మొదటి లాంచింగ్‌ కాంప్లెక్స్‌లో పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి బిల్డింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి నుంచి డమ్మీ వాహక నౌకను లాంచ్‌ప్యాడ్‌ మొబైల్‌ సర్వీసు టవర్‌ వద్దకు ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు.

ఈ యేడాది ఎక్కువ ప్రయోగాల చేయాలని చూస్తు ఇస్రో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించ నుంది. లాంచ్‌ వెహికల్‌ అన్ని దశలను, ఉపగ్రహాలను ఇంటిగ్రేషన్‌ చేసి లాంచ్‌ప్యాడ్‌ వద్దకు తీసుకెళ్తారు. అంటే ప్రయోగ వేదికపై ఒక రాకెట్‌ను సిద్ధం చేస్తుండగా, ఈ ఫెసిలిటితో మరో ప్రయోగానికి సంబంధించిన రాకెట్‌ భాగాలను ఇంటిగ్రేషన్‌ చేయవచ్చు.

అదనంగా పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే వాణిజ్య ప్రయోగాలతో వడివడిగా అడుగులు వేస్తున్న ఇస్రో ఏడాది వాటి పరిధిని మరింత విస్తృత పరిచేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News