Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు

Viveka Murder Case: రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తున్న తీరు

Update: 2023-04-24 02:03 GMT

Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు

Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి కేసు దర్యాప్తులో రోజుకొక కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్యకు , మొదటి భార్య కుటుంబానికి మధ్య ఆస్తి గొడవలున్నాయని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రెండు రోజుల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కూడా బయటకు వచ్చింది. కేసులో గా మారిన అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్ అంశాలు రోజుకో మలుపు తిప్పుతున్నాయి.

వివేకానంద హత్య జరిగిన సమయంలో ఏం జరిగిందనేది దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో తెలిపాడు. నవంబర్ 2018 నాటికి బెంగుళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ ఒకటి పూర్తైంది. దీనికి సంబంధించిన రూ.8 కోట్ల డబ్బును కలెక్ట్ చేసుకునేందుకు వివేకా, దస్తగిరి, గంగి రెడ్డి బెంగుళూరు వెళ్లారు. అయితే వివేకాను ఆ డబ్బు విషయంలో 50 శాతం షేర్ కావాలని గంగిరెడ్డి అడిగాడు. దీంతో ఆగ్రహించిన వివేకా.. షేర్ అడిగేంతవాడివి అయ్యావా? అని గంగిరెడ్డిని తిట్టి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. హత్య చేసే ముందు కూడా డబ్బు తనకు ఇవ్వాలని వివేకాను గంగిరెడ్డి అడిగాడు. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయని.. ఇప్పుడు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎక్కువ డబ్బులు వస్తాయని.. అప్పుడు ఇస్తానని వివేకా చెప్పారు. అయితే వివేకా ఎంత చెప్పినా గంగిరెడ్డి వినిపించుకోలేదు. డబ్బు ఇప్పుడే కావాలని వివేకాను పట్టుబట్టాడు అని దస్తగిరి స్టేట్‌మెంట్‌లో చెప్పాడు.

మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డితో 2010 లో తనకు వివాహం అయ్యిందని షేక్ షమీమ్ తెలిపారు. అయితే 2011లో మరోసారి వివాహం చేసుకున్నామన్నారు. రెండు సార్లు వివాహం జరిగినట్లుగా షమీమ్ తెలిపారు. 2015లో తమకు షహన్ షా పుట్టారని సీబీఐకి తెలిపింది. వివేక హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు షమీమ్ తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు. వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు బెదిరించారని ఆమె సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు పరిశీలించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇంట్లో కూడా సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు . వివేకానందరెడ్డి ఇంటికి నలుగురు సభ్యుల సీబీఐ బృందం వెళ్లి వివేకానందరెడ్డి బెడ్రూమ్, బాత్రూమ్ ను సీబీఐ అధికారులు పరిశీలించారు.

వారం రోజుల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మూడు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించారు. ఐదు రోజులుగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారిస్తున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ప్రశ్నించారు. ఆసక్తికర విషయాలను వెలికితీశారు. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News