Anakapalli: విహారయాత్రలో విషాదం.. అనకాపల్లి జిల్లా శారదానదిలో విద్యార్ధి గల్లంతు

Anakapalli: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా తుమ్మపాల సమీపంలోని శారదానదిలో స్నానానికి దిగి ఇంటర్‌ విద్యార్ధి గల్లంతయ్యారు.

Update: 2025-11-24 05:44 GMT

Anakapalli: విహారయాత్రలో విషాదం.. అనకాపల్లి జిల్లా శారదానదిలో విద్యార్ధి గల్లంతు

Anakapalli: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా తుమ్మపాల సమీపంలోని శారదానదిలో స్నానానికి దిగి ఇంటర్‌ విద్యార్ధి గల్లంతయ్యారు. విశాఖ NADలోని శ్రీ చైతన్య కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు, నిన్న బోజ్జన్న కొండకు పిక్నిక్ వె‎ళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు పక్కనే ఉన్న శారదా నదిలో స్నానానికి దిగారు. వారిలో సాయి తనుజ్ అనే విద్యార్థి ఒక్కసారిగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, NDRF బృందాల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో రాత్రి గాలింపు నిలిపివేశారు. ప్రస్తుతం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థి తనుజ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News