విశాఖ వేదికగా ఐసీఐడీ అంతర్జాతీయ సమావేశాలు.. 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు

ICID 25th Congress: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరు

Update: 2023-11-02 07:09 GMT

విశాఖ వేదికగా ఐసీఐడీ అంతర్జాతీయ సమావేశాలు.. 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు 

ICID 25th Congress: విశాఖ వేదికగా ఐసీఐడీ అంతర్జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఐసీఐడీ ప్రతినిధులతో కలిసి అంతర్జాతీయ సమావేశాలను సీఎం జగన్ ప్రారంభించారు. విశాఖ వేదికగా వారం రోజుల పాటు అంతర్జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు 90 దేశాల నుంచి ప్రతినిధులు హజరయ్యారు. సదస్సు నిర్వహణ బాధ్యతలు ఏపీకి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని... సాగునీటి రంగం, వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏపీ అన్ని వనరులు కల్గిన రాష్ట్రమని సీఎం జగన్ అన్నారు.

Tags:    

Similar News