Nara Bhuvaneswari: గాంధీవంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు
Nara Bhuvaneswari: నా తండ్రి, భర్త ఎప్పుడు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదు
Nara Bhuvaneswari: గాంధీవంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు
Nara Bhuvaneswari: చంద్రబాబు తన ఆయుషు కూడా పోసుకుని బతికి ప్రజలకి సేవ చేయాలని నారా భువనేశ్వరి అన్నారు. ఈ దీక్ష ప్రజలు కోసం చేస్తున్నానని ఆమె వెల్లడించారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు జీవితం తప్పలేదన్నారు. తన తండ్రి, భర్త ఎప్పుడూ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదని ఆమె వెల్లడించారు. తమకు ఆ అలవాటు లేదన్నారు. తమ కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదన్నారు. మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసినా తెలుగుదేశం బిడ్డలు పార్టీని ముందుకి తీసుకువెళ్తారని ఆమె పేర్కొన్నారు. మమ్మల్ని ఎలా లోపలికి తోద్దామా అని చూస్తున్నారని భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు ఆలోచన అమరావతి, పోలవరం అంటూ ఆమె తెలిపారు.