Anitha: బంగారమ్మపాలెం గ్రామంలో హోం మంత్రి అనిత పర్యటన
Anitha: అనకాపల్లి జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రి అనిత పర్యటించారు.
Anitha: అనకాపల్లి జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రి అనిత పర్యటించారు. బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు సత్తియ్య కుటుంబాన్ని పరామర్శించి.. నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డ్వాక్రా మహిళలతో ఫైలట్ ప్రాజెక్ట్గా సోలార్ ఫ్యానల్ ద్వారా చేపలు ఎండబెట్టే ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్ళకు పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.