Chandrababu: చంద్రబాబుకు అదనపు షరతులపై నేడు హైకోర్టు తీర్పు

Chandrababu: సీఐడీ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు పూర్తి

Update: 2023-11-03 03:41 GMT

Chandrababu: చంద్రబాబుకు అదనపు షరతులపై నేడు హైకోర్టు తీర్పు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లను సీఐడీ ఫిర్యాదులో పేర్కొంది.

ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీ సీఎండీ ఫిర్యాదు. కాగా నేడు ఈ కేసు విచారణకు రానుంది. మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కాం కేసులో హరికృష్ణ తోపాటు టేరాసాఫ్ట్ ఎండీకి సంబంధించిన ఏడు స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదనా అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో సీఐడి అధికారులు పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News