Corona: కరోనా సెకండ్ వేవ్.. చావు కేకలేనంటూ బాలయ్య కంటతడి

Corona: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2021-05-04 09:54 GMT

కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ

Corona: దేశంలో కరోనా సెకండ్ ఉధృతి కొన‌సాగుతుంది. రోజురోజుకు మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోతుంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నా క‌ట్ట‌డి కావ‌డంలేదు. రెండో ద‌శ‌లో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

కరోనా ఆసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయ‌న అన్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయకపోవడం, అధికారుల మధ్య సమన్వయ లోపించడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని బాల‌కృష్ణ ఆరోపించారు.

రాష్ట్రంలో ఎటు చూసినా చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అభద్రతాభావం పెరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా స్టే హోమ్.. స్టే సేఫ్అంటూ బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు.

విపత్కర పరిస్థితుల్లో ఎవ్వరూ బయటకు రాకుండా, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలి బాలకృష్ణ సూచించారు. హిందూపురం కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాలని, కావాల్సినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారుల‌కు సూచించారు.

Tags:    

Similar News