Visakhapatnam: పారిశుద్ధ్య కార్మికులకు చేయూత

జీవీఎంసీ 49, 50, 51వ వార్డుల పారిశుద్ధ్య సిబ్బందికి ఎస్‌డీవీ ఛానల్‌ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు ఒక్కొక్కరికీ 25 కేజీల బియ్యం, రూ.1000 మాస్కులు అందజేశారు.

Update: 2020-04-13 13:40 GMT

విశాఖపట్నం: జీవీఎంసీ 49, 50, 51వ వార్డుల పారిశుద్ధ్య సిబ్బందికి ఎస్‌డీవీ ఛానల్‌ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు ఒక్కొక్కరికీ 25 కేజీల బియ్యం, రూ.1000 మాస్కులు అందజేశారు. శ్రీదేవి పార్కు సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైకాపా ఉత్తర నియోజకవర్గ బాధ్యులు కె.కె.రాజు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఛానల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సత్యనారాయణరాజు, 50వ వార్డు వైకాపా కార్పొరేటర్‌ అభ్యర్ధి వావిలపల్లి ప్రసాద్‌, వార్డు అధ్యక్షురాలు పప్పల సునీత తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News