Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం నుంచి ఆగని వర్షం

Tirumala: పగలు, రాత్రి తేడా లేకుండా ఎడతెరపి లేకుండా వర్షం

Update: 2023-12-04 07:45 GMT

Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం నుంచి ఆగని వర్షం

Tirumala: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం ముంచెత్తనుంది. మైచౌంగ్ తుఫాన్ ప్రభావం నేడు, రేపు రాయలసీమలో జిల్లాలపై ఉండనుంది.తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా కూరుస్తున్న వర్షానికి ఏడుకొండలు తడిచి ముద్దైంది. పగలు - రాత్రి తేడా లేకుండా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరుమలకు వచ్చిన భక్తులకు ఓవైపు వర్షంతో పాటుగా మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వర్ష ప్రభావంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దర్శనానికి వెళ్లే సమయంలోను తిరిగి గదులకు వెళ్లే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు.

Tags:    

Similar News