Nara Lokesh: జగన్ వస్తానంటే టికెట్ కొని మరీ మ్యాచ్ చూపిస్తా..
Nara Lokesh: టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ వీక్షించడంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
Nara Lokesh: జగన్ వస్తానంటే టికెట్ కొని మరీ మ్యాచ్ చూపిస్తా..
Nara Lokesh: టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ వీక్షించడంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. తనకు దేశభక్తి ఉందని, అందుకే మ్యాచ్ చూడటానికి వెళ్లానని స్పష్టం చేశారు.
ఇండియా ఫైనల్‌కు వెళ్తే మళ్లీ వెళ్తా:
"టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడటానికి వెళ్తాను. పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారు వస్తానంటే, ఆయనకు కూడా నేనే టికెట్ తీసి మరీ మ్యాచ్ చూపిస్తాను" అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. క్రికెట్ మ్యాచ్ చూడటాన్ని కూడా రాజకీయం చేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
హెరిటేజ్ - ఇందపూర్ వివాదంపై వివరణ:
హెరిటేజ్ సంస్థకు, ఇందపూర్‌కు మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను లోకేష్ కొట్టిపారేశారు. "హెరిటేజ్ అనేది ఒక లిస్టెడ్ కంపెనీ. కేవలం పన్నీర్, చీజ్ తయారీ (Manufacturing) విషయంలో మాత్రమే ఇందపూర్ సంస్థతో వ్యాపార భాగస్వామ్యం ఉంది. అంతకు మించి హెరిటేజ్‌కు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు" అని వివరించారు.
బొత్స వ్యాఖ్యలపై విమర్శలు:
సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు 'కో-పార్టనర్' (Co-Partner) కు, 'కో-మాన్యుఫాక్చరర్' (Co-Manufacturer) కు మధ్య తేడా తెలియకపోవడం దారుణమని లోకేష్ విమర్శించారు. వ్యాపార భాగస్వామ్యాలను తప్పుగా చిత్రీకరిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని హితవు పలికారు.