Rains Update: ఏపీలోని జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్..రేపు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
Heavy Rain: తీరం దాటిన వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు వర్ష గండం
Rains Update: ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాతావరణ అనిశ్చితితో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పిడుగులతోపాటు గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, క్రిష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు శుక్రవారం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా గుల్లదుర్దిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.