Rain Alert: ముంచుకొస్తున్న ముప్పు..ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై తుపాన్ ఒకటి ఏర్పడింది. దానితో మే 1న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల ఎండ ఉంటుంది. ఏపీ, తెలంగాణ, యానాం, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వారమంతా గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఉంటుందనీ..ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్లు కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వారమంతా వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఈ గాలులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని చెప్పింది. నేడు గురువారం ఉదయం నుంచి మధ్య, ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉదయం 9 గంటల సమయంలో తూర్పు, తెలంగాణలో నల్లగొండ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మళ్లీ సాయంత్రం తెలొంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. రాత్రి 7 తర్వాత హైదరాబాద్ లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. రాత్రి 10 తర్వాత ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది.