Supreme Court: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Supreme Court: బెయిల్‌ రద్దు చేయాలని కోరిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్‌

Update: 2024-04-16 11:07 GMT

Supreme Court: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Supreme Court: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ కోరారు. చంద్రబాబు బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్‌ దాఖలైందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని లోకేష్‌ బెదిరిస్తున్నారని, రెడ్‌ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్‌ చేయడం లేదా.. వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్‌ ప్రసంగాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రంజిత్‌కుమార్‌.

అయితే.. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్దార్థ లూత్రా.. చంద్రబాబు బెయిల్‌ షరతులు ఉల్లంఘించడం లేదని అన్నారు. లోకేష్‌ మాట్లాడితే బెయిల్‌ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందన్నారు. ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు.. చంద్రబాబు బెయిల్‌ షరతులు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్పింది. అలాగే.. లోకేష్‌ అధికారులను బెదిరిస్తున్నారన్న రెడ్‌ బుక్‌ అంశంపై అప్లికేషన్‌ లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రార్‌కు సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Tags:    

Similar News