అమరావతి రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
* 2 పిటిషన్లను విచారించనున్న జస్టిస్ కె.ఎం. జోసెఫ్
అమరావతి రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Supreme Court: ఏపీ అమరావతి రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయగా.. హైకోర్టు తీర్పును యధాతథంగా అమలు చేయాలని రాజధాని రైతులు పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ఏపీ రాజధాని విషయంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందని తెలిపింది. 3 రాజధానుల గురించి తమకు తెలియదని అఫిడవిట్‌లో పేర్కొంది. మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం మూడు రాజధానులపై దూకుడుగా వ్యవహరిస్తోంది. విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభిస్తామని ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో రాజధాని అంశంపై విచారన ఉత్కంఠ రేపుతోంది.