AP SSC Exams 2021: పదో తరగతి పరీక్షలు వాయిదా
AP SSC Exams 2021: కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆదిమూలపు సురేష్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )
AP SSC Exams 2021: కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 7న జరగాల్సిన టెన్త్ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పరిస్థితులు అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.