జగనన్న విద్యా దీవెన వసతి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జగనన్న విద్యాదీవెనతో, అమ్మఒడి, నాడు నేడు తదితర పథకాలతో రాష్ట్రంలో విద్యా విప్లవాన్ని సిఎం జగన్ తెస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Update: 2020-02-25 05:48 GMT

రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జగనన్న విద్యాదీవెనతో, అమ్మఒడి, నాడు నేడు తదితర పథకాలతో రాష్ట్రంలో విద్యా విప్లవాన్ని సిఎం జగన్ తెస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలోని డైట్ కేంద్ర సభాభవనంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని చీఫ్ విప్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదరికం వలన ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యం తో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో నూతన విప్లవానికి నాంది పలికారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికే 'అమ్మ ఒడి'పథకంలో ఇంటికి ఒక విద్యార్థి కి వంతున ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత చదువులు చదివించి తద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పం నెరవేరే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు.


Tags:    

Similar News