ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఒకేసారి మూడు నెలల పింఛన్

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి పింఛన్‌ పొందలేని మూడు నెలల పింఛన్ల ఇవ్వాలని నిర్ణయించింది.

Update: 2020-05-02 13:50 GMT
Gopal Krishna Dwivedi (File Photo)

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి పింఛన్‌ పొందలేని మూడు నెలల పింఛన్ల ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలోనూ జగన్ సర్కార్ ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 90 శాతం మందికి ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసింది. పింఛన్ సొమ్మును వారి లబ్ధిదారుల చేతికే అందించే పనిని వాలంటీర్లు విజయవంతంగా పూర్తి చేశారు.

మార్చి, ఏప్రిల్‌, మే నెలల పింఛన్ పొందలేని వారందరికీ జూన్ నెలలో మూడు నెలల పింఛన్ డబ్బు అందజేస్తామని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ మేరకు మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న పింఛన్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు గత రెండు నెలల్లో పింఛన్ డబ్బులు‌ తీసుకోని వారికి జూన్ నెలలో మొత్తం 3 నెలలకు సంబంధించిన పించన్ చెల్లింపులు చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.



 


Tags:    

Similar News