PM Kisan Yojana 22nd Installment: ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ అయ్యేది ఎప్పుడో తెలుసా?
PM Kisan Yojana 22nd Installment: ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ అయ్యేది ఎప్పుడో తెలుసా?
PM Kisan Yojana 22nd Installment: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా ఇప్పటివరకు 21 విడతల్లో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన రైతుకు సంవత్సరానికి మొత్తం రూ.6,000 అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా విడగొట్టి, ప్రతి విడతలో రూ.2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది.
సాధారణంగా ఈ పథకం నిధులు ఏప్రిల్–జూలై, ఆగస్టు–నవంబర్, డిసెంబర్–మార్చి అనే మూడు దశల్లో విడుదలవుతుంటాయి. గతంలో 21వ విడతకు సంబంధించిన రూ.2,000ను నవంబర్ 2025లో రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలో చూస్తే, 2026 సంవత్సరానికి సంబంధించిన తొలి విడతగా భావిస్తున్న రూ.2,000ను మార్చి 2026లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, ఎరువుల ధరలు, కూలీల వేతనాలు వంటి కారణాలతో రైతులకు అందిస్తున్న వార్షిక రూ.6,000 సాయం సరిపోవడం లేదని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే రైతులకు అది పెద్ద ఊరటగా మారనుంది.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం లేదని సమాచారం. ముఖ్యంగా e-KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులకు ఈ సమస్య ఎదురవుతోందని అధికారులు చెబుతున్నారు. అందుకే 22వ విడత పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా తమ e-KYC పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే ఈ ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుందని చెబుతున్నారు. పూర్తి వివరాలు, తాజా అప్‌డేట్స్ కోసం రైతులు అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.