Bandla Ganesh: సీఎం కోసం బండ్ల గణేష్ పాదయాత్ర
Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన భక్తిని చాటుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం తిరుమల వెంకటేశ్వరస్వామికి చేసిన మొక్కును తీర్చుకోవడానికి మహా పాదయాత్ర చేపట్టనున్నారు.
Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన భక్తిని చాటుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం తిరుమల వెంకటేశ్వరస్వామికి చేసిన మొక్కును తీర్చుకోవడానికి మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పవిత్ర పాదయాత్ర జనవరి 19న ప్రారంభం కానుంది. షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి కాలినడకన తిరుమల వరకు ఈ యాత్ర సాగనుంది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
చంద్రబాబు నాయుడుకు బండ్ల గణేష్ అభిమానిగా ఉండటం అందరికీ తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టైన సమయంలో ఆయన త్వరగా బయటపడాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు బెయిల్‌పై విడుదలై, ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ మొక్కు నెరవేరింది.
ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునే క్రమంలో బండ్ల గణేష్ మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి 19న షాద్‌నగర్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో ఆయన కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ యాత్రకు అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. బండ్ల గణేష్ నిర్ణయం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.