Tanikella Bharani: తిరుమల శ్రీవారి సేవలో తనికెళ్ల భరణి
Tanikella Bharani: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు.
Tanikella Bharani: తిరుమల శ్రీవారి సేవలో తనికెళ్ల భరణి
Tanikella Bharani: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ ధనుర్మాసంలో శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు తిరుపతికి వచ్చానని, ఆ స్కూల్ విద్యతో పాటు సనాతన విలువలను కూడా నేర్పుతోందని ప్రశంసించారు.