ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త..

Update: 2020-05-26 10:26 GMT
YS Jagan(File photo)

ఇప్పటికే పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా వ్యవసాయ రంగంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు.

వైఎస్ జగన్ సర్కార్ మరో సారి విన్నూత్న ప్రయోగానికి సిద్ధమైంది. డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్లుందుకు వివిధ గ్రామాల్లో విత్తనాల ఏటీఎంలు ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ 'ఎటిఎం' ల ద్వారా రైతులకు విత్తనాలను అందించనున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10, 641 గ్రామాలను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ 'కియోస్క్‌'ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌ వంటి మార్కెటింగ్‌ సేవలు రైతులకు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌ 'ఏటీఎం'లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ 'కియోస్క్‌' ఏటీఎం సెంటర్లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ కియోస్క్‌ 'ఏటీఎం'లను ఏర్పాటు చేయటం దేశ చరిత్రలోనే తోలి ప్రయోగం అని ప్రభుత్వం చెబుతోంది. అదే విధంగా ప్రభుత్వం రైతులకు అందించే అన్నింటిని ఈ కియోస్క్‌ 'ఏటీఎం'ల ద్వారా తీసుకోవచ్చు అని.. వ్యవసాయ రంగాలకు చెందిన అన్ని వస్తువులు, సేవలు రైతు ఇది వద్దే దొరికేలా చేయటమ ఈ కేంద్రాల యొక్క ప్రేత్యేకత. పంట సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు సరైన సలహాలు, ఎరువులు,పురుగుల మందులు, చివరికి మార్కెటింగ్ కూడా రైతులు ఈ ఏటీఎం కేంద్రంగా చేసుకోవచ్చు. మనం సాధారణంగా బ్యాంక్ ఎటిఎంల వద్ద నగదు ఎలా విత్ డ్రా చేసుకుంటామో అదే విధంగా ఈ కియోస్క్‌ 'ఏటీఎం'ల ను ఉపయోగించు కోవచ్చు అనే వివరించారు.   

Tags:    

Similar News