Visakhapatnam: విస్తృతంగా సేవలందిస్తున్న గాయిత్రీ పరివార్

కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున గాయిత్రీ పరివార్ సభ్యులు విస్తృతంగా సేవలందిస్తున్నారు.

Update: 2020-04-09 06:03 GMT
విశాఖపట్నం: కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున గాయిత్రీ పరివార్ సభ్యులు విస్తృతంగా సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా దండుబజార్, శాలిపేట, పందిమేట్ట తదితర ప్రాంతాలలో

మాస్కులను పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు మరియు కొందరి దాతల సహాయంతో ఇప్పటి వరకూ 1200 మాస్కులను పంపిణీ చేశారు. వీటిలో సుమారు 700 మాస్కులను ట్రస్ట్ సభ్యుడు జగదీష్ అశోపాస్వయంగా తయారు చేసి ఇవ్వగా మిగతా వాటిని కొనుగోలు చేసి అందిస్తున్నారు.

మూడు వేల మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామని ట్రస్ట్ సభ్యులు ఇందుకూరి అవతారం రాజు తెలిపారు. అదే విధంగా స్లమ్ ప్రాంతాలలో నివసించే పేదవారికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంట నూనె చొప్పున 100 కుటుంబాలకు అందజేశామన్నారు. అలాగే వివేకానంద శివ సమితి ద్వారా గోషా ఆసుపత్రి వద్ద ఉదయం వేళ టిఫిన్ సమకూరుస్తున్నామన్నారు.


Tags:    

Similar News