ఎస్.రాయవరం: మండలంలోని ధర్మవరం గ్రామంలో మాజీ ఉప సర్పంచి, కొణతాల రామకృష్ణ అనుచరుడు సియ్యాదుల అచ్యుత్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖకి చెందిన జింసర్ (గీతం) ఆసుపత్రి వైద్యులచే మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గుండె, ఎముకలు, ఉపిరితిత్తులు, చిన్నపిల్లల, మహిళల సమస్యలను వైద్య నిపుణులు డా.శ్రీకిరణ్, డా.సుచిత్ర, డా.మీరావల్లి, డా.వేదప్రియ, డా.శ్రీహర్షలు రోగులను పరీక్షించారు.
గ్రామస్థులుతో పాటు సమీప గ్రామస్థులు 508 మందికి ఉచతంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కాగా వీరిలో 90 మందిని విశాఖలోని జింసర్ ఆసుపత్రికి తదుపరి వైద్యం నిమిత్తం సిఫారసు చేశారు.