మొదట్లోనే కట్టడి చేయాలి లేకుంటే ఇబ్బందులు... మాజీ మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

గ్రామ సచివాలయ ఉద్యోగాలపై మాజీమంత్రి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేసారు.

Update: 2020-05-10 13:13 GMT
Dharmana prasad Rao(File photo)

గ్రామ సచివాలయ ఉద్యోగాలపై మాజీమంత్రి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేసారు. గ్రామ సెక్రటేరియట్ లలో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఇది సరైన పద్ధతి కాదని, మొదట్లోనే కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటామని, సమయపాలన పాటించకపోవడం, ఉదయం హాజరు వేసి వెళ్లిపోవడం చేస్తున్నారని చెప్పారు. మరికొందరు ఉద్యోగులు ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అలాంటి వ్యవహార శైలి చూపుతున్న వారికి మెమోలు జారీ చేయాలని అన్నారు. ఆసక్తి లేకుంటే అటువంటి వారు రాజీనామా చేయాలన్నారు. 

Tags:    

Similar News