ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి.. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
కాగా ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా రూల్స్‌కు విరుద్దంగా ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు చేశారంటూ మొత్తం ఏడు ఆరోపణలపై విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలు, నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. 1980 ఐపీఎస్ బ్యాచ్ చెందిన ఏబీ వెంకటేశ్వరరావును గతంలోనే బదిలీ చేసిన వైసీపీ ప్రభుత్వం.. కొన్నాళ్లు పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో పెట్టింది. ఇప్పుడు సస్పెన్షన్ విధిస్తు ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.