Konaseema: నీట మునిగిన గ్రామాలు.. రేషన్ కార్డుకి ఒకే ఆహార పొట్లం ఇస్తున్నారన్న బాధితులు..

Konaseema: ప్రభుత్వం తమను పట్టించుకోవాలని డిమాండ్

Update: 2023-07-31 12:57 GMT

Konaseema: నీట మునిగిన గ్రామాలు.. రేషన్ కార్డుకి ఒకే ఆహార పొట్లం ఇస్తున్నారన్న బాధితులు

Konaseema: గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఆహారం ప్రధాన వీధుల్లో ఉన్న వారికి తప్ప లోపల ఉన్న తమకు అందడం లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. అలాగే రేషన్ కార్డుకి ఒక ఆహార పొట్లం మాత్రమే ఇస్తున్నారని కుటుంబంలో ఐదు, ఆరుగురు సభ్యులు ఉంటే ఎక్కడ సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇటీవల పరామర్శించి వెళ్లిపోయారని, తమ బాధను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు మంచినీళ్లు, ఆహారం సమృద్ధిగా అందించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News