శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు

Update: 2019-09-10 15:28 GMT

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తూంది. శ్రీశైలం డ్యామ్ వద్ద 6 క్రెస్టు గేట్లను 23అడుగులు మేర ఎత్తి దిగువనకు 3,20,136 క్యూసెక్కులు వరదనీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు కూడా పూర్థి స్థాయి నీటి సామర్ధ్యం చేరుకుంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 884.90 అడుగులకు నమోదయింది.

ఎగువ జూరాల నుంచి తుంగభద్ర నుంచి సుంకేసుల ద్వారా 3,30 వేల 468 క్యూసెక్కులు ఉండగా శ్రీశైలం డ్యాం 6 క్రస్ట్ గేట్ల ద్వారా 23 అడుగుల ఎత్తుతో 3లక్షల 20 వేల136 క్యూసెక్కుల నీరు.. కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా మరొ 71,000 క్యూసెక్కులు వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నీటి నిలువలను సమీక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.  

Tags:    

Similar News