Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Prakasam Barrage: ఆంధ్రప్రదేశ్‌లో వరుణదేవుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

Update: 2025-08-28 07:50 GMT

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Prakasam Barrage: ఆంధ్రప్రదేశ్‌లో వరుణదేవుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో (ప్రవాహం వచ్చేది) మరియు ఔట్‌ఫ్లో (విడుదల చేయడం) రెండూ 4.05 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యాయి. వరదనీటి ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నదీ తీర ప్రజలకు అధికారులు హెచ్చరికలు

వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి, వాటిని దాటే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేశారు. ప్రమాద పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులతో సంప్రదించాలి, హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు.

Tags:    

Similar News