Andhra News: కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు..

Andhra News: పటమటకు చెందిన విద్యార్థులుగా గుర్తింపు

Update: 2022-12-16 12:29 GMT

Andhra News: కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు.. 

Andhra News: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యనమలకుదురు సమీపంలోని కృష్ణానదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తొలుత ఒక విద్యార్థి నీటిలో మునిగిపోతున్న క్రమంలో ఒడ్డున ఉన్న మరో నలుగురు విద్యార్థులు అతన్ని కాపాడేందుకు వెళ్లి నీటమునిగారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. బాధితులంతా విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. విద్యార్థులు గల్లంతవ్వడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మొత్త ఏడుగురిలో ఇద్దరిని స్థానికులు రక్షించారు.

Tags:    

Similar News