Gannavaram: నివురు గప్పిన నిప్పులా గన్నవరం
Gannavaram: దాడులు ప్రతి దాడులతో నిన్నంతా అట్టుడికిన గన్నవరం
Gannavaram: నివురు గప్పిన నిప్పులా గన్నవరం
Gannavaram: గన్నవరం నియోజకవర్గం నివురు గప్పిన నిప్పులా మారింది. నిన్న దాడులు ప్రతి దాడులతో గన్నవరం అట్టుడుకింది. గన్నవరం పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలోకి కొత్తవారిని రానివ్వకుండా కట్టడి చేస్తున్నారు. వంశీ అనుచరులు, టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి. దాడుల్లో పాల్గొన్న వారిలో 16 మందిని అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు. నియోజకవర్గంలో వంశీ అల్లర్లు ప్రేరేపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. బయటి వ్యక్తులకు నియోజకవర్గంలో పనేంటని వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు. నిన్న జరిగిన పరిణామాలపై టీడీపీ నేతలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.