Visakhapatnam: విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు

Visakhapatnam: విశాఖలోని జగదాంబ జంక్షన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ హాస్పిటల్‌లోని రెండవ అంతస్తు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Update: 2023-12-14 06:45 GMT

Visakhapatnam: విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు

Visakhapatnam: విశాఖలోని జగదాంబ జంక్షన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ హాస్పిటల్‌లోని రెండవ అంతస్తు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు. మరో వైపు హాస్పిటల్‌ పరిసరాల్లో భారీగా పొగ వ్యాపించింది. హాస్పిటల్‌లోని రోగులను అంబులెన్సుల ద్వారా ఇతర హాస్పిటళ్లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News